అధిరిపోయే ఫీచర్స్‌తో జూలై 16న లాంచ్ చేసిన OnePlus Nord 4 మోడల్ వన్‌ప్లస్ వినియోగదారాలను భలే ఆకర్షిస్తోంది. దేశీయ మార్కెట్‌లో OnePlus Nord 4 పేరుతో లాంచ్ అయిన ఈ మోడల్ దీని కంటే ముందు మోడల్ OnePlus Nord 3 ధర కంటే తక్కువే.
దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తన ప్రాభల్యాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు టెక్ బ్రాండ్ వన్‌ప్లస్ ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకు భాగంగానే ఇటీవల వరుసగా సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తోంది. తాజాగా అధిరిపోయే ఫీచర్స్‌తో జూలై 16న లాంచ్ చేసిన OnePlus Nord 4 మోడల్ వన్‌ప్లస్ వినియోగదారాలను భలే ఆకర్షిస్తోంది. దేశీయ మార్కెట్‌లో OnePlus Nord 4 పేరుతో లాంచ్ అయిన ఈ మోడల్ దీని కంటే ముందు మోడల్ OnePlus Nord 3 ధర కంటే తక్కువకే అందించడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. OnePlus Nord 4 స్నాప్‌డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. అలాగే, 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో డ్యూయల్ కెమెరాలతో ఆకట్టుకుంటోంది. అంతేకాదు, నాలుగు సంవత్సరాల పాటు Android OS అప్‌డేట్‌లను తీసుకుంటుంది.
మనదేశంలో OnePlus Nord 4 ప్రారంభ ధర రూ. బేస్ మోడల్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ కోసం 29,999, 8GB RAM + 256GB స్టోరేజ్ మరియు 12GB RAM + 256GB స్టోరేజ్ ఉన్న హై-ఎండ్ వేరియంట్‌ల ధరలు వరుసగా రూ. 32,999, రూ. వరుసగా 35,999గా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ మెర్క్యురియల్ సిల్వర్, ఒయాసిస్ గ్రీన్, అబ్సిడియన్ మిడ్‌నైట్ షేడ్స్‌లో లభిస్తుంది. ఈ కొత్త ఫోన్ వన్‌ప్లస్ ఆన్‌లైన్ స్టోర్, అమెజాన్ ఇండియా మరియు ఇతర రిటైల్ స్టోర్‌ల ద్వారా ప్రీ-ఆర్డర్‌లకు జూలై 20 నుండి జూలై 30 వరకు అవకాశం ఉంటుంది. ఆగస్టు 2 నుంచి ఓపెన్ మార్కెట్‌లోకి అడుగుపెట్టనుంది. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా OnePlus Nord 4 బేస్ వేరియంట్, హై-ఎండ్ వేరియంట్‌ల ధరల్లో రూ.3000 వరకూ తగ్గింపు ఉంటుంది.
OnePlus Nord 4 ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతూ.. ఆక్సిజన్OS 14.1తోపాటు డ్యూయల్-సిమ్ (నానో) సపోర్ట్ చేస్తుంది. అలాగే, నాలుగు సంవత్సరాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లతోపాటు మరో రెండు సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్‌లను అందిస్తుంది. ఈ ఫోన్ 6.74-అంగుళాల U8+ OLED అద్భుతమైన డిస్‌ప్లేతో ఉంటుంది. ఈ మొబైల్ 120Hz రిఫ్రెష్ రేట్, 2,150 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్‌తో ఉండడం విశేషం.దీని శక్తివంతమైన 5,500mAh బ్యాటరీ సామర్థ్యం అదనపు ఫీచర్‌గా చెప్పొచ్చు. ఇది 100W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు అవకాశమిస్తుంది. ఈ ఛార్జర్ కేవలం 28 నిమిషాల్లో 1 నుంచి 100 శాతం వరకు ఫోన్‌ను ఛార్జ్ చేస్తుందన మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఫోన్ వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాకు సోనీ లైట్600 సెన్సార్ అమర్చబడి ఉంటుంది. అలాగే, 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాను అమర్చారు. సెల్ఫీల కోసం ప్రత్యేకంగా రూపొందిచిన 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఎవ్వరైనా ఇష్టపడాల్సిందే.
స్క్రీన్ లోపల ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌లోపాటు కొన్ని ప్రత్యేక AI ఫీచర్లును కూడా అందించారు. ఈ హ్యాండ్‌సెట్ ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌కు అందిస్తుంది. అలాగే, నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్‌తో డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంటుంది. ఈ కొత్త Nord ఫోన్ లాంగ్ ఆడియో ఫైల్‌లను AI ఆడియో సహాయంతో వేగవంతం చేయగలదు. అంతేకాదు, 100W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఈ మొబైల్ 5,500mAh బ్యాటరీ వస్తోంది. OnePlus యొక్క ఇంటర్నెల్ బ్యాటరీ హెల్త్ ఇంజిన్ టెక్నాలజీని కలిగి ఉండ, AI సహాయంతో బ్యాటరీ వినియోగం, ఛార్జింగ్ అలర్ట్, అలాగే ఫోన్ 80 శాతం ఛార్జ్ అయిన తర్వాత ఛార్జింగ్‌ను ఆప్టిమైజ్ చేస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కేవలం 28 నిమిషాల్లో బ్యాటరీని 1 నుండి 100 శాతం వరకు నింపుతుందని కంపెనీ వెల్లడించింది.
புதுப்புது தொழில்நுட்ப செய்திகள், அறிமுகமாகும் கருவிகள் பற்றிய விமர்சனங்கள் எல்லாவற்றையும் உடனுக்குடன் தமிழில் பெற பேஸ்புக் மற்றும் ட்விட்டர் NDTV Tamilஐ பின் தொடருங்கள்.
விளம்பரம்
விளம்பரம்