1.43-అంగుళాల AMOLED స్క్రీన్‌తో OnePlus వాచ్ 2R వ‌చ్చేస్తోంది..

1.43-అంగుళాల AMOLED స్క్రీన్‌తో OnePlus వాచ్ 2R వ‌చ్చేస్తోంది..
ஹைலைட்ஸ்
  • OnePlus వాచ్ 2R, OnePlus వాచ్ 2, OnePlus స‌మ్మ‌ర్ లాంచ్ ఈవెంట్‌, OnePlus
  • ஒன்பிளஸ் இன்று உலக சந்தைகளுக்கு (இந்தியா உட்பட) ஒத்த தோற்றமுடைய OnePlus வ
  • ஒன்பிளஸ் வாட்ச் 2ஆர் வாட்ச் 2 போன்ற வன்பொருளைக் கொண்டுள்ளது, இது அதன் மல
விளம்பரம்

OnePlus స‌మ్మ‌ర్ లాంచ్ ఈవెంట్‌లో భాగంగా ఈవారం మ‌న దేశీయ మార్కెట్‌లో OnePlus Nord 4తోపాటు OnePlus వాచ్ 2R, OnePlus Nord బడ్స్ 3 ప్రోను కంపెనీ విడుద‌ల చేసింది. ఈ ఈవెంట్‌లో రిలీజ్ చేసిన OnePlus వాచ్ 2R ప్ర‌స్తుతం మార్కెట్‌లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తోంది. వృత్తాకార డయల్‌ను కలిగి ఉన్న ఈ స్మార్ట్ వాచ్ సింగిల్‌ ఛార్జింగ్‌తో 12 రోజుల బ్యాటరీ లైఫ్‌ను పొందుతుంద‌ని కంపెనీ ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన OnePlus వాచ్‌ 2కు ఈ OnePlus వాచ్‌ 2R అప్‌డేటెడ్ వెర్ష‌న్‌గా క‌నిపిస్తుంది. OnePlus వాచ్ 2ను ఈ ఏడాది ఫిబ్రవరిలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2024లో ఆవిష్కరించిన విష‌యం తెలిసిందే. మ‌రెందుకు ఆల‌స్యం వినియోగ‌దారుల‌ను తెగ ఆక‌ర్షిస్తోన్న OnePlus వాచ్ 2R విశేషాలేంటో చూసేద్దాం రండి!

ఆ రెండు రంగుల్లో లభిస్తుంది

మ‌న దేశంలో OnePlus వాచ్ 2R ధర రూ. 17,999గా ఉంది. అలాగే, ఇండియాలో OnePlus అధికారిక వెబ్‌సైట్ ద్వారా జూలై 20 నుండి కొనుగోలు చేయడానికి అందుబాటులోకి వ‌చ్చింది. ఈ స్మార్ట్ అల్యూమినియం ఛాసిస్‌తో స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ బకెల్స్‌, సిలికాన్ స్ట్రాప్స్‌ను కలిగి ఉండి.. గ్రీన్‌, గ‌న్‌మెట‌ల్ గ్రే రెండు రంగుల‌లో ల‌భిస్తుంది. ఈ వాచ్ 1.43 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో 466 x 466 పిక్సెల్స్ రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్, 1,000 నిట్స్ డిస్ప్లే లైటింగ్‌తో ల‌భ‌స్తుంది. ఇది స్నాప్‌డ్రాగన్ W5 మరియు BES2700 చిప్‌సెట్‌తో కూడిన డ్యూయల్-ఇంజిన్ ఆర్కిటెక్చర్‌తో రూపొందించ‌బ‌డింది. ఇందులోని WearOS 4 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌ను నడుపుతుంది, రెండోది RTOSని హ్యాండిల్ చేస్తుంది. ఇది 2GB RAM, 32GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ సామ‌ర్థ్యంతో ఉంటుంది. 

ఆరోగ్య పర్యవేక్షణా సెన్సార్‌లు

కొత్తగా లాంచ్ అయిన ఈ OnePlus వాచ్ 2R డ్యూయల్-బ్యాండ్ GPS, Beidou, Galileo, GLONASS, QZSS, Wi-Fi, బ్లూటూత్ కనెక్టివిటీని క‌లిగి ఉంటుంది. అంతేకాదు, ఈ వాచ్ హార్ట్ రేట్‌, రక్తంలో ఆక్సిజన్ స్థాయితో సహా అనేక ఆరోగ్య, ఆరోగ్య పర్యవేక్షణ సెన్సార్‌లను కలిగి ఉంది. మ‌న‌లోని ఒత్త‌డి స్థాయిని నిత్యం ప‌ర్య‌వేక్షిస్తూ ఉంటుంది. అంతేకాదు, నిద్ర మరియు ఒత్తిడి స్థాయిలను ట్రాక్ చేసి మ‌న‌ల్ని ఎప్ప‌టిక‌ప్పుడు అల‌ర్ట్ చేస్తుంటుంది. ఆరోగ్యానికి సంబంధించిన మొత్తం డేటాను ట్రాక్ చేయడంలో సహాయపడే OHealth యాప్‌కి అనుకూలంగా ప‌ని చేస్తుంది. ఈ వాచ్‌ 2R 5ATM వాటర్‌ రెసిస్టెంట్, IP68 రేటింగ్‌తో వాటర్‌, డస్ట్‌ రెసిస్టెన్స్‌గా త‌యారు చేయ‌బ‌డింది. ఈ కార‌ణంగా OnePlus వాచ్ 2R స్మార్ట్‌వాచ్‌తో వినియోగదారులు ఈత కొట్టడంతోపాటు అనేక బహిరంగ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చని కంపెనీ పేర్కొంది.

స్మార్ట్ మోడ్‌లో బ్యాటరీ లైఫ్‌ 100 గంటలు

ఈ స్మార్ట్‌వాచ్ USB టైప్-సీ పోర్ట్ ద్వారా 7.5W Vooc ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 500mAh బ్యాటరీ అందుబాటులోకి వ‌స్తోంది.  కేవ‌లం 60 నిమిషాల్లో సున్నా నుండి 100 శాతానికి ఛార్జ్ ఫుల్ అవుతుంద‌ని కంపెనీ పేర్కొంది. ఈ వాచ్ స్మార్ట్‌మోడ్‌లో 10 నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్‌తో 24 గంట‌ల‌పాటు బ్యాటరీ లైఫ్ అందిస్తుందని వెల్ల‌డించారు. ఇది స్మార్ట్ మోడ్‌లో 100 గంటల బ్యాటరీ లైఫ్‌, అలాగే పవర్ సేవింగ్ మోడ్‌లో 12 రోజుల వరకు బ్యాట‌రీ లైఫ్ ఉంటుంది. వాచ్‌లో అల్యూమినియం డ‌యిల్‌తో ఉండి, స్టెయిన్‌లెస్ స్టీల్ బకిల్స్‌తో కూడిన సిలికాన్ బెల్ట్ స్థానంలో వ‌స్తుంది. ఆ బెల్ట్‌తో క‌లిపి వాచ్ బరువు 59 గ్రా ఉంటుంది. అలాగే, ఒక్క డ‌యిల్‌తో చూసుకుంటే మాత్రం దాని బరువు 37 గ్రా ఉంటుంది.

Comments

புதுப்புது தொழில்நுட்ப செய்திகள், அறிமுகமாகும் கருவிகள் பற்றிய விமர்சனங்கள் எல்லாவற்றையும் உடனுக்குடன் தமிழில் பெற பேஸ்புக் மற்றும் ட்விட்டர் NDTV Tamilஐ பின் தொடருங்கள்.

மேலும் படிக்க: one plus company
Gadgets 360 Staff The resident bot. If you email me, a human will respond. மேலும்
பேஸ்புக்கில் பகிரலாம் Gadgets360 Twitter Shareட்வீட் பகிர் Snapchat ரெட்டிட்டில் கருத்து
#சமீபத்திய செய்திகள்
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »